లంకేయులపై భారత్ తొలి వన్డే కైవసం

దంబుల్లా: ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా శ్రీలంకతో ప్రారంభమైన తొలిరోజు భారత జట్టు ఘన విజయం సాధించింది. భారత ఆటగాళ్లు బౌలింగ్, బ్యాటింగ్ లలో ఉత్తమ ప్రతిభ చూపడంతో శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో విజయం సాధించారు. శిఖర్ దావన్ అద్బుతమైన బ్యాటింగ్ చేశారు. మొత్తం 90 బంతుల్లో 132 పరుగులు తీసి లంకేయులకు పరుగులు పెట్టించాడు. జట్టు కెప్టెన్ కోహ్లీ 70 బంతుల్లో 82 పరుగులు తీయడంతో శ్రీలంక నిర్దేశించిన 217 పరుగుల లక్ష్యాన్ని […]

దంబుల్లా: ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా శ్రీలంకతో ప్రారంభమైన తొలిరోజు భారత జట్టు ఘన విజయం సాధించింది. భారత ఆటగాళ్లు బౌలింగ్, బ్యాటింగ్ లలో ఉత్తమ ప్రతిభ చూపడంతో శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో విజయం సాధించారు. శిఖర్ దావన్ అద్బుతమైన బ్యాటింగ్ చేశారు. మొత్తం 90 బంతుల్లో 132 పరుగులు తీసి లంకేయులకు పరుగులు పెట్టించాడు. జట్టు కెప్టెన్ కోహ్లీ 70 బంతుల్లో 82 పరుగులు తీయడంతో శ్రీలంక నిర్దేశించిన 217 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది.

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక ప్రారంభంలో ఉత్తప ఆట ప్రదర్శన చూపించినప్పటికీ ఆపై భారత బౌలర్ల దెబ్బకు బెంబేలెత్తింది. స్పిన్నర్ల దెబ్బకు లంకేయులు విలవిల్లాడారు. చావల్, కేదర్ జాదవ్, అక్షర పటేల్ లు స్పిన్నర్లుగా అద్భుతంగా రాణించారు. అక్షర పటేల్ 3వికెట్లు తీయగా, చావల్, పేసర్ బూమ్రా, కేదర్ జాదవ్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టగలిగారు.భారత జట్టు బౌలర్లు సమష్టిగా రాణించడంతో 217 పరుగుల సాధారణ లక్ష్యాన్ని మాత్రమే లంక నిర్దేశించగలిగింది.

India took the first ODI on the Lankans

Related Stories: