రోడ్లెక్కిన బడుగు జీవుల బతుకులు

ఆలూ లేదు చూలూ లేదు  శంకుస్థాపన చేసేసారు నిధులు లేకుండానే శంకుస్థాపన ప్రారంభం కానీ మినీ కాంప్లెక్స్ పనులు నాగర్‌కర్నూల్:  జిల్లాకేంద్రంలో ఒకవైపు ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు వేగంగా పావులు కదుపు తున్నారు. గత ఏడాది జిల్లా కేంద్రంలో రోడ్ల వెడల్పు కోసం కూల్చివేతలు, డబ్బాల తొలగింపు కార్యక్రమం నిర్వహించారు. అప్పటినుండి రోడ్లపై చిరువ్యా పా రాలు చేసుకునే వారి పరిస్థితి ఇబ్బంది కరంగా మారడంతో ప్రత్యామ్నాయం వైపు బడుగు జీవులు ఎదురు చూస్తున్నారు. ఈ […]

ఆలూ లేదు చూలూ లేదు  శంకుస్థాపన చేసేసారు
నిధులు లేకుండానే శంకుస్థాపన
ప్రారంభం కానీ మినీ కాంప్లెక్స్ పనులు

నాగర్‌కర్నూల్:  జిల్లాకేంద్రంలో ఒకవైపు ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు వేగంగా పావులు కదుపు తున్నారు. గత ఏడాది జిల్లా కేంద్రంలో రోడ్ల వెడల్పు కోసం కూల్చివేతలు, డబ్బాల తొలగింపు కార్యక్రమం నిర్వహించారు. అప్పటినుండి రోడ్లపై చిరువ్యా పా రాలు చేసుకునే వారి పరిస్థితి ఇబ్బంది కరంగా మారడంతో ప్రత్యామ్నాయం వైపు బడుగు జీవులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాన రోడ్డు పై ఉన్న రైతు బజారు ఖాళీ స్థలంలో రెండు దఫాలుగా రూ.3.30 కోట్లు వ్యయంతో దుకాణాల సముదాయాలు నిర్మించేందుకు నిర్ణయించారు.

మొదటి విడతలో కోటీ 52లక్షల వ్యయంతో 35దు కాణాల నిర్మాణానికి గత ఏడాది నవంబర్ మొదటి వారంలో మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు, జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావులు శంకుస్థాపన చేశారు. దీంతో చిరువ్యాపా రుల్లో ఆశలు చిగురించాయి.  వేగంగా దుకాణాలు నిర్మాణం చేసి తమకు ఉపాది కల్పిస్తారని ఆశించారు. ఇంతవరకు బాగానే వున్నా నిర్మాణాలు నేటి వరకు ప్రారంభం కాలేదు.

నిధులు -టెండర్ల ఊసేలేదు

ఏ పనైనా మొదలు పెట్టాలంటే ముందు దానికి సంబందించిన ప్లాన్ తయారుచేయడం అవసరమైన నిధులు మంజూరిచేయాల్సి ఉంటుం ది. కానీ అట్టహాసంగా శంకుస్థాపన చేసిన మినికాంప్లెక్స్ నిర్మాణానికి ఎలాంటి నిధులు మంజూరి కానట్లు తెల్సింది.దీంతో టెండర్లుకూడా పిలవలేదు. ఎలాంటి నిధుల్లేకుండా కేవలం ఎస్టీమే షన్లతోనే శంకు స్థాపనలు చేయడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

డబ్బులు మంజూరి కాకుండా శంకు స్థాపన ఎందుకు చేసినట్లు ఇలా చే యడంవల్ల ప్రభుత్వం అప్రతిష్టకు గురయ్యే అవకాశం కూడా లేకపో లేదన్నది పలువురి భావన.కాగా రోడ్డు డివైడర్ పనులు ,ముందు వంతెన నిర్మాణం పనులు, నల్లవల్లి రోడ్డులో ఎడ తెగకుండాకొనసా గుతున్న రోడ్డు నిర్మాణం పనులతోపాటు పోలీ సుల నిబంధనలతో రోడ్డు పక్కన తాత్కాళికంగా వ్యాపారం చేసి పొ ట్ట గడుపుకుంటున్న బడుగు జీవుల బ్రతుకు భారంగా మారింది. ఇప్పటికైనా వెంటనే నిధులు మంజూరి చేసి టెండర్లు పిలిచి పనులు త్వరిత గతిన ప్రారం బించి దుకాణాలను అర్హులైన వారికి కెటా యించకపోతే చిన్న వ్యాపా రుల వెతలు మరింత కష్టతరం అయ్యే అవకాశం ఉంది.

త్వరలోనే టెండర్లు పిలుస్తాం

మొదటి ఫేజ్‌లో కోటి రు.50లక్షలతో 35 దుకాణాలు నిర్మిం చడానికి ప్రణాళికలు సిద్దం చేశాం. ఇందుకు సంబంధించి శంకు స్థాపనలు కూడా చేశాం. కానీ నిధులు ఇప్పటి వరకు విడుదల కాలే దు. ఆమన్‌గల్ మార్కెట్ కమిటి నుండి రు.50 లక్ష లు లోన్‌గా తీసుకున్నాం. ఇంకా రు. 50 లక్షలు సమకుర్చుకొని అందుకు సంబంధించిన టెండర్లను త్వరలోనే పిలుస్తాం.నిర్మాణాలను త్వరిత గతిన పూర్తి చేస్తాం.

జి. బాలమణి, జిల్లా మార్కెటింగ్ అధికారిణి,నాగర్‌కర్నూల్

Comments

comments

Related Stories: