రోడ్డు ప్రమాదం…ముగ్గురు మృతి

జోగుళాంబ గద్వాల: జిల్లాలోని 44వ హైవేపై పుల్లూరు టోల్ ప్లాజా వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి […]

జోగుళాంబ గద్వాల: జిల్లాలోని 44వ హైవేపై పుల్లూరు టోల్ ప్లాజా వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులను కిరణ్‌సింగ్, కూతుళ్లు అక్షితబాయి, శారదబాయిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Stories: