రోడ్డు ప్రమాదంలో హోంగార్డు దుర్మరణం

Home guard died in Road Accident at Kamareddy

కామారెడ్డి : భిక్కనూరు మండలం బస్వాపూర్ శివారులోని 44వ జాతీయ రహదారిపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రామస్వామి అనే హోంగార్డు చనిపోయాడు. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. భిక్కనూరు పోలీసు స్టేషన్‌లో రామస్వామి హోంగార్డుగా పని చేస్తున్నారు. తన సొంత గ్రామమైన బస్వాపూర్ నుంచి పోలీసు స్టేషన్‌కు బైక్‌పై వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన కంటైనర్ ఢీకొంది. దీంతో రామస్వామి అక్కడికక్కడే చనిపోగా, బైక్‌పై ఉన్న ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Home guard died in Road Accident at Kamareddy