రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

Person died in Road Accident

రంగారెడ్డి : అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. డిసిఎం నుంచి జారి పడి నల్లగొండ జిల్లా మాదారం గ్రామానికి చెందిన అబ్దుల్ జానీ (35) మృతి చెందాడని పోలీసులు తెలిపారు. కొంగరకలాన్‌లో టిఆర్‌ఎస్ తలపెట్టిన ప్రగతి నివేదన సభకు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోస్టుమార్టం కోసం జానీ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Person died in Road Accident