రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Young man dead in road accident

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మచ్చ బొల్లారంకు చెందిన సోహన్‌సింగ్ కుమారుడు సూరజ్‌సింగ్ (27) ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే శనివారం ఉదయం ఆల్వాల్ నుంచి సుచిత్ర కి వెళ్ళే దారిలో ద్విచక్రవాహనం (టిఎస్ 10ఈపి7747) ను ఆజాగ్రత్తగా నడుపుతూ… సుచిత్రలోని మహింద్రా సర్వీస్ వద్ద సిఎన్‌జి డిసిఎం (టి ఎస్ 08 యూడి 6115) ను ఢీకొట్టడంతో తలకి తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఘటనకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకున్నారు. మృత దేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి, ఎస్‌ఐ గంగాధర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments