రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

హైదరాబాద్: ఆ జాగ్రత్తగా వాహనం నడుపుతూ.. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి మృతి చెందిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జీడిమెట్లలోని రాఘవేంద్రకాలనీకి చెందిన అబద్దం కుమారుడు సోమాల లావారాజు (31) స్థానికంగా ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. పని నిమిత్తం సుచిత్ర వేళ్ళేందుకు తన హోండా ఆక్టివా వాహనంపై వెళ్తుండగా శ్రీకృష్ణనగర్ సమీపంలో వెనుక నుంచి అతివేగంగా దూసుకవచ్చిన సంతోష్ ట్రావేల్స్ బస్సు ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై […]

హైదరాబాద్: ఆ జాగ్రత్తగా వాహనం నడుపుతూ.. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి మృతి చెందిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జీడిమెట్లలోని రాఘవేంద్రకాలనీకి చెందిన అబద్దం కుమారుడు సోమాల లావారాజు (31) స్థానికంగా ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. పని నిమిత్తం సుచిత్ర వేళ్ళేందుకు తన హోండా ఆక్టివా వాహనంపై వెళ్తుండగా శ్రీకృష్ణనగర్ సమీపంలో వెనుక నుంచి అతివేగంగా దూసుకవచ్చిన సంతోష్ ట్రావేల్స్ బస్సు ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న సోమాల లావారాజుకు తలకి తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పేట్‌బషీరాబాద్ పోలీసులు ఘటన స్థలానికి చెరుకుని వివరాలు నమోదు చేసుకుని మృత దేహని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments

Related Stories: