రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Person killed in the road accident

ఇటిక్యాల : ద్విచక్రవాహనం అదుపు తప్పి వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం దువ్వాసిపెల్లి స్టేజ్ దగ్గర చోటు చేసుకుంది. కొండాపురం ఎస్ఐ వస్రం నాయక్ కథనం ప్రకారం… మునగాల గ్రామానికి చెందిన మౌల గార్లపాడు గ్రామానికి చెందిన మౌల తమ స్నేహితుడు దేవందర్‌ను వదలడానికి ఎర్రవల్లి నుండి గార్లపాడుకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఆకస్మాత్తు కుక్క అడ్డురావడంతో అదుపుతప్పి కిందపడ్డారు. ఈ సంఘటనలో మౌల (30) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్ఐ తెలిపారు.

Comments

comments