రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి …

Person Died In Road Accident In Nalgonda District

నల్లగొండ: ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొట్టిన ప్రమాదంలో  వ్యక్తి  మృతి చెందిన ఘటన నాగార్జున సాగర్ ముత్యలమ్మ గుడి దగ్గర చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో  వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు నాగార్జున సాగర్ ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాదంలో మృతి చెందిన  వ్యక్తి ఖమ్మంకు చెందిన జనార్ధన్ గా పోలీసులు గుర్తించారు.

Comments

comments