రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

  సదాశివపేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం నాడు సదాశివపేట మండలంలోని నందికంది గ్రామ పరిధిలోని 65వ నెంబర్ జాతీయ రహదారి పై చోటు చేసుకుంది. సిఐ సురేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… రంగారెడ్డి జిల్లా మర్పల్లి మండలం కలకోడా గ్రామానికి చెందిన మాలిక్ పట్నాకర్‌పటేల్ (60) సంగారెడ్డి పట్టణం నుండి సదాశివపేట వైపు బైక్‌ పై వెళ్తున్నాడు. మండలంలోని నందికంది వద్ద 65వ నెంబర్ జాతీయ రహదారి పై సాయంత్రం 5.30 […]

 

సదాశివపేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం నాడు సదాశివపేట మండలంలోని నందికంది గ్రామ పరిధిలోని 65వ నెంబర్ జాతీయ రహదారి పై చోటు చేసుకుంది. సిఐ సురేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… రంగారెడ్డి జిల్లా మర్పల్లి మండలం కలకోడా గ్రామానికి చెందిన మాలిక్ పట్నాకర్‌పటేల్ (60) సంగారెడ్డి పట్టణం నుండి సదాశివపేట వైపు బైక్‌ పై వెళ్తున్నాడు. మండలంలోని నందికంది వద్ద 65వ నెంబర్ జాతీయ రహదారి పై సాయంత్రం 5.30 గంటల సమీపంలో రెండు బైక్‌లు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో పట్నాకర్ పటేల్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న సంజీవ్‌కు గాయాలయ్యాయి. సంజీవన్‌ను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ఆసుపత్రికి తరలించినట్లు సిఐ పేర్కొన్నారు.

Comments

comments

Related Stories: