రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

మేడ్చల్: గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన ప్రమాద ఘటన మేడ్చల్ జిల్లాలోని శామీర్‌పేట్ వద్ద రాజీవ్ రహదారిపై సోమవారం ఉదయం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న ఇద్దరిని ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకొని ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం అక్కడి సిసిటివి […]

మేడ్చల్: గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన ప్రమాద ఘటన మేడ్చల్ జిల్లాలోని శామీర్‌పేట్ వద్ద రాజీవ్ రహదారిపై సోమవారం ఉదయం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న ఇద్దరిని ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకొని ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం అక్కడి సిసిటివి పుటేజీలను పరిశీలించి ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించే పనిలో ఉన్నారు.

Comments

comments

Related Stories: