రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

పరిగి : గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పరిగి మండల పరిధిలో చోటు చేసుకుంది. పరిగి మండలం సయ్యద్‌మల్కాపూర్ గ్రామానికి చెందిన ఉప్పరి శ్రీనివాస్ తన భార్యకు పుట్టిన బిడ్డను చూసేందుకు అత్తగారిళ్లు అయిన కొందుర్గుకు బుధవారం రాత్రి తన బైక్‌పై బయలు దేరాడు. పరిగి మండల ఖుదావంద్‌పూర్ గ్రామానికి చెందిన తన బావ మరిది అంజయ్యను వెనకాల కూర్చోబెట్టుకొని కొందుర్గుకు వెళ్లారు. తన పాపను చూసి తిరిగి […]

పరిగి : గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పరిగి మండల పరిధిలో చోటు చేసుకుంది. పరిగి మండలం సయ్యద్‌మల్కాపూర్ గ్రామానికి చెందిన ఉప్పరి శ్రీనివాస్ తన భార్యకు పుట్టిన బిడ్డను చూసేందుకు అత్తగారిళ్లు అయిన కొందుర్గుకు బుధవారం రాత్రి తన బైక్‌పై బయలు దేరాడు. పరిగి మండల ఖుదావంద్‌పూర్ గ్రామానికి చెందిన తన బావ మరిది అంజయ్యను వెనకాల కూర్చోబెట్టుకొని కొందుర్గుకు వెళ్లారు. తన పాపను చూసి తిరిగి మళ్లీ ఇంటికి బయలు దేరారు. కొందర్గు నుంచి పరిగి మండలం సయ్యద్‌పల్లి వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఉప్పరి శ్రీనివాస్ తల వెనక బాగం నుంచి వాహనం టైర్ పోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనకాల కూర్చున్న అంజయ్య, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రగాయాలైన ఇద్దరికి పరిగి ప్రభుత్వాస్పత్రిలో చికిత్సలు నిర్వహించిన పరిస్థితి విషమించడంతో నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ కృష్ణ తెలిపారు.

Comments

comments