రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

person death in road accident

కల్లూరు: మండల పరిధిలోని ఖాన్‌ఖాన్‌పేట గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతిచెందగా కుమార్తెకు తీవ్రగాయాలైన సంఘటన గురువారం చోటు చేసుకుంది.  కృష్ణా జిల్లా, గంపలగూడెం మండలం, గొల్లపూడి గ్రామానికి చెందిన కొంగల వెంకటి (40) తన కుమార్తె రమ్యతో కలిసి ఖాన్‌ఖాన్‌పేటలోని తమ బంధువుల ఇంట్లో వివాహ వేడుకకు హాజరై ద్విచక్ర వాహనంపై తిరిగి గొల్లపూడి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న టాటా ఏస్ ఢీకొనటంతో వెంకటి అక్కడికక్కడే మృతి చెందాడు. కుమార్తె రమ్యకు తీవ్ర గాయాలు కావటంతో పరిస్థితి విషమించటంతో 108లో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. గత నెల రోజల క్రితమే వెంకటి భార్య గుండెపోటులో మృతిచెందటం, ఇప్పుడు వెంకటి రోడ్డు ప్రమాదంలో దుర్మరణ పాలవటం, కుమార్తె రమ్య పరిస్థితి కూడా విషమించటంతో గొల్లపూడి గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. ఎస్‌ఐ డి. పవన్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.