రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

man death in road accident
జగిత్యాలటౌన్: జగిత్యాల మండలం లక్ష్మీపూర్ నల్లగుట్ట వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు సతీశ్ పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్ జీపు డ్రైవర్‌గా పని చేస్తున్నట్టు తెలుస్తోంది. సతీష్ తన బైక్ పై జగిత్యాల నుంచి ధర్మారం వైపుకు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టడంతో తీవ్ర గాయాల పాలైన సతీష్ ఘటన స్థలంలోనే అక్కడికక్కడే మృతి చెందాడు. జగిత్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Comments

comments