రోడ్డు ప్రమాదంలో వృక్తి మృతి

one person dead in road accident

బేల: మండలంలోని శంకర్‌గూడ గ్రామం దగ్గర శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రలోని గోవింద్‌పుర్ గ్రామానికి చెందిన రమకృష్ణా(45) మృతి చెందాడు. బేల ఎస్ఐ సాయన్న తెలిపిన వివరాల ప్రకారం… బేల నుంచి మహారాష్ట్రలో ఉన్న కోర్హన తాలుకలోని గోవింద్‌పుర్ గ్రామానికి మోటర్ సైకిల్ మిద వెళ్తుండగా శంకర్‌గూడ గ్రామం దగ్గర అగి ఉన్న లారీని ఢీకొట్టాడు దీంతో రామకృష్ణ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సుమారు రాత్రి 10 గంటలోపు జరిగినదని పేర్కొన్నారు. మృతుదేహంను పోస్టుమార్టం కోరకు జిల్లాలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మృతునికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ పేర్కొన్నారు.