రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Young man died in road accident
గుడిహత్నూర్‌: అతివేగం, అజాగ్రత్త కారణంగా ఓ యువకుడు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రగాయాల పాలైన సంఘటన మండలంలోని గ్రామ సమీపంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… ఇంద్రవెల్లి మండలంలోని పాటగూడ గ్రామానికి చెందన సిడాం గోవింద్‌రావ్ గెడం వివేక, కాత్లే జ్యోతిరాం, కుమ్ర జ్ఞానేశ్వర్ అనే యువకులు పల్సర్ మోటర్ సైకిల్‌పై ఇచ్చోడ పైపు వెల్తుండగా మోటర్‌ సైకిల్ అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకోనడంతో సిడాం గోవింద్‌ రావ్(22) సంఘటన స్థలంలోనే మృతి చెందగా, మిగతా యువకులు తీవ్రంగా గాయాపడ్డారు. గాయపడ్డ యువకులను 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. ఒక బైక్‌పై అజాగ్రత్తగా నలుగురు యువకులు ప్రయాణించడమే కాకుండా, అతివేగంగా బైక్‌ను నడపడంతో అదుపుతప్పి ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాలుస్వామి రాముగౌడ్ తెలిపారు.

Comments

comments