రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

BIKE-ACCIDENT

మేడ్చల్ : ఘట్‌కేసర్ మండలం ఔషాపూర్ వద్ద గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు చనిపోయాడు. మరొక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించారు. హెచ్‌పిసిఎల్ వద్ద పెట్రోల్ ట్యాంకర్ బైక్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడి వివరాలు తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Young Man died in Road Accident