రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

బెంగళూరు : బెంగళూరు – మంగళూరు జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. 13 మంది ప్రయాణికులతో వెళుతున్న మినీ వ్యాను టైరు పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. వీరు టూర్‌కు వెళుతుండగా ఈ విషాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను […]

బెంగళూరు : బెంగళూరు – మంగళూరు జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. 13 మంది ప్రయాణికులతో వెళుతున్న మినీ వ్యాను టైరు పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. వీరు టూర్‌కు వెళుతుండగా ఈ విషాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Three People died in Road Accident

Comments

comments

Related Stories: