రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

road-accident-image-done

మంచిర్యాల : హజీపూర్ సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు జైపూర్ పవర్‌ప్లాంట్లులో ఇంజినీర్లుగా పని చేస్తున్న గంగా సత్యశశిధర్(విశాఖ), తేజస్వి(హైదరాబాద్), చంద్రశేఖర్(చోడవరం,విశాఖ)గా గుర్తించారు. వీరు మంచిర్యాల నుంచి లక్షెట్టిపేట వైపు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. పోలీసులు కేసు విచారిస్తున్నారు.

Comments

comments