రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

గుంటూరు : తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. మరో మహిళ తీవ్రంగా గాయపడింది. గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు. రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను బిజెపి ఎంపి నరసింహారావు కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. రోడ్డు ప్రమాదం అనంతరం ఎంపి నరసింహారావు వేరు కారులో విజయవాడకు వెళ్లినట్టు తెలిసింది. ఎంపి కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై […]

గుంటూరు : తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. మరో మహిళ తీవ్రంగా గాయపడింది. గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు. రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను బిజెపి ఎంపి నరసింహారావు కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. రోడ్డు ప్రమాదం అనంతరం ఎంపి నరసింహారావు వేరు కారులో విజయవాడకు వెళ్లినట్టు తెలిసింది. ఎంపి కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Woman killed in Road Accident

Related Stories: