రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి…

Women Dies In Road Accident In Medchal District

మనతెలంగాణ/ మేడ్చల్ : కొడుకును పరామర్శించడానికి వస్తూ పరలోకానికి వెళ్లిన సంఘటన మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకొంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్ద మండలం, ఎర్రబోగాడ గ్రామం, సోమనాథ్ తండకు చెందిన జాదన్ సునీత(30) తన భర్త అంబర్ సింగ్‌తో కలిసి ఐడిఏ బొల్లారంలో క్యాంటీన్‌లో పనిచేస్తు జీవిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం తన కుమారుడి అనారోగ్యంతో బాధ పడతుంటే మేడ్చల్ పరిధిలోని మెడిసి ఆస్పత్రిలో చేర్చారు. తన కుమారుడిని చూడటానికి క్యాంటీన్ ఓనర్ తో కలిసి శనివారం ద్విచక్రవాహనంపై వస్తుండగా మార్గమద్యంలో కండ్లకొయ్య గుబ్బకోల్డ్ స్టోరేజ్ వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. దింతో తలకు తీవ్ర గాయాలైన సునీత అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు మేడ్చల్ పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments