రోడ్డు ప్రమాదంలో జింక మృతి

 Deer killed in road accident In Sangareddy District

జోగిపేటః సంగారెడ్డి జిల్లా జోగిపేట సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని తెలంగాణ రాష్ట్ర జంతువు జింక మృతి చెందిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. శనివారం అందోల్ మండలం కన్‌సాన్‌పల్లి, రాంసానిపల్లి శివారు మధ్యలోని జాతీయ రహదారపై ఈ ఘటన చోటు చేసుకుంది. జోగిపేట సి.ఐ తిరుపతిరాజు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యాహ్నం వేళ పొలాల్లోంచి వచ్చిన జింక జాతీయ రహదారిని దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో జింక అక్కడికక్కడే మృతి చెందింది. కాగా ఈ సమాచారం అందుకున్న జోగిపేట సిఐ తిరుపతిరాజు వెంటనే తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. జింకను పరిశీలించిన సీఐ అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు అక్కడి చేరుకుని మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆటవీశాఖ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సిఐ తిరుపతిరాజు తెలిపారు. ఇదిలా ఉంగా ఆటవి ప్రాంతంలో ఉండాల్సిన జింకలు అందోల్ మండలంలో సంచరిస్తున్నట్లు కొన్ని రోజులుగా వస్తున్న పుకార్లకు ఈ జింక మరణం తెరదించినట్లు అయిందని చెప్పవచ్చు.

Comments

comments