రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

Eight years girl dead in road accident
కొండమల్లెపల్లి: లారీ ఢీకొనడంతో చిన్నారి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని గౌరికుంట తండా వద్ద సోమవారం చోటు చెసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మండల పరిధిలోని గౌరికుంటతండా గ్రామానికి చెందిన రమావత్ రమేష్- సునిత దంపతుల చిన్న కుమార్తే నిఖిత (08) మండల కేంద్రంలోని కృష్ణవేణి పాఠశాలలో రెండవ తరగతి చదువుతుంది. సోమవారం భారత బంద్ కావడంతో పాఠశాలలకు సెలవు ప్రకటించగా తల్లితో పాటు నిఖిత తమ వ్యవసాయ పోలం దగ్గరకు వెళ్లుతూ రోడ్డుకు దాటే క్రమంలో నల్లగొండ వైపు నుండి కొండమల్లెపల్లి వైపుకు వస్తున్న లారీ చిన్నరిని ఢీకొనడంతో పాప లారీ వెనుక టైర్ క్రింద పడి తీవ్ర గాయాల పాలైంది. తీవ్ర గాయపడిన నిఖితను 108 వాహనంలో దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మర్గమద్యంలో మృతి చెందింది. దీంతో బందవులు అందోళనకు దిగి లారీ డ్రైవర్ అంజిరెడ్డి పారి పోతుండగా వెంబండించి డ్రైవర్‌పై దాడి చేయడంతో డ్రైవర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు వేంటనే సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు డ్రైవర్ అంజిరెడ్డిని అదుపులోకి తీసుకుని అతనిని దవాఖానకు తరలించారు. చిన్నారి తల్లి సునిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు హెడ కానిస్టేబుల్ యం.యం.రాజు తెలిపారు.

Comments

comments