రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

శామీర్‌పేట : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్న సంఘటన శామీర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సిద్దిపేట జిల్లా, నంగునూర్ మండలంకు చెందిన లచ్చమ్మ, శిరీష, భార్గవి(16)లు నగరంలోని లాలాపేటలో తన తల్లిదండ్రులతో జీవిస్తున్నారు. బుధవారం స్వగ్రామం నంగునూర్‌లో లచ్చమ్మ ఫింఛన్ తీసుకోవడానికి తన మనవరాలు శిరీష, భార్గవిలతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. మార్గ మధ్యంలో శామీర్‌పేట మండలం, తూంకుంట […]

శామీర్‌పేట : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్న సంఘటన శామీర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సిద్దిపేట జిల్లా, నంగునూర్ మండలంకు చెందిన లచ్చమ్మ, శిరీష, భార్గవి(16)లు నగరంలోని లాలాపేటలో తన తల్లిదండ్రులతో జీవిస్తున్నారు. బుధవారం స్వగ్రామం నంగునూర్‌లో లచ్చమ్మ ఫింఛన్ తీసుకోవడానికి తన మనవరాలు శిరీష, భార్గవిలతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. మార్గ మధ్యంలో శామీర్‌పేట మండలం, తూంకుంట పరిధిలోని అలంకృత రిసార్ట్ వద్ద రాజీవ్ రహదారిపై వెనుక నుంచి అతివేగంగా టాటాఎసి వాహనం ఢీకొట్టింది. దీంతో ముందు వెళ్తున్న టిప్పర్ లారీ ఎడమ వైపు చక్రంలోకి ద్విచక్ర వాహనం సొచ్చుకు పోయి భార్గవి అక్కడికక్కడే మృతి చెందగా లచ్చమ్మ తీవ్ర గాయాలు అయ్యి అపస్మాకర స్థితిలోకి వెల్లింది. శిరీష తలకు హెల్మేట్ ధరించడంతో స్వల్పగాయాలతో బయట పడింది.

ద్విచక్ర వాహనంను ఢీకొట్టిన టాటా వాహనం ఇంజన్ లో నుండి మంటలు చెలరేగాయి. టాటా ఏసి వాహనంలో నగరంలోని వనస్థాలి పూరం నుంచి కరీంనగర్‌లో ఓ విందులో పాల్గొనేందుకు కుటుంబ సభ్యులు వెల్తున్నారు. అన్నదమ్ములకు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పొలీసులు తెలిపారు. టాటా ఏసి వాహనంలో వెనుకాల కూర్చున్న డ్రైవర్ తల్లి స్వరూపకు స్వల్ప గాయాలతో బయట పడ్డారు.  వెనుకాల కూర్చున్న ఇద్దురు పిల్లలు, డ్రైవర్ తండ్రి, అక్కకు ఎలాంటి గాయాలు కాలేదు. భార్గవి మృతదేహన్ని పోస్టుమార్టుం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.  లచ్చమ్మ, రాజశేఖర్, వెంకటేశ్‌ల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు శామీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments

Related Stories: