రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

One killed in road accident
మానవపాడు : ఉండవల్లి మండలం జాతీమ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించి ఒకరు మృతి చెందగా, మరోకరికి తీవ్రగాయాలైన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ గడ్డం కాశి కథనం ప్రకారం… మరమునగాల గ్రామానికి చెందిన గొల్లమద్దిలేటి, మల్లికార్జున్ అనే ఇద్దరు రైతులు పొలం పనులకు మందు పిచికారి చేసే తైవాన్ పంపు చేడి పోవడంతో కర్నూల్‌కు వెళ్లి రీపేర్ చేయించుకోవాలని ద్విచక్ర వాహనంపై మంగళవారం మరమునగాల నుంచి కర్నూల్‌కు బయాలుదేరారు. సరిగ్గా ఉండవల్లిస్టేజి సమీపంలో జాతీయ రహదారిపై ద్విచక్రవాహనంపై వెళ్లుతుండగా వెనకాల నుంచి లారీ ఢీకొనడంతో గొల్లమద్దిలేటి టైరు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మల్లికార్జున్ కు తీవ్ర గాయాలు కావడంతో కర్నూల్ దవాఖానకి తరలించి లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్ఐ తెలిపారు.