రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రాన్ని ఆనుకుని ఉన్న బైపాస్ రోడ్డులో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో చందుర్తి మండలం బండపల్లికి చెందిన గడ్డం సత్యంరెడ్డి (35) మృతి చెందాడు. ఐదుగురికి గాయాలయ్యాయి. బైపాస్‌రోడ్డులో కంకరతో వెళ్తున్న టిప్పర్ ద్విచక్ర వాహనంపై వస్తున్న సత్యంరెడ్డిని ఢీ కొనడంతో సత్యంరెడ్డికి, ఆయన తల్లి ఎల్లవ్వకు తీవ్రగాయాలయ్యాయి. మోటార్‌ బైక్‌ను ఢీకొన్న వెంటనే టిప్పర్ సికింద్రాబాద్ నుండి వేములవాడకు వస్తున్న వేములవాడ డిపో బస్సును ఢీ కొట్టింది. దాంతో […]

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రాన్ని ఆనుకుని ఉన్న బైపాస్ రోడ్డులో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో చందుర్తి మండలం బండపల్లికి చెందిన గడ్డం సత్యంరెడ్డి (35) మృతి చెందాడు. ఐదుగురికి గాయాలయ్యాయి. బైపాస్‌రోడ్డులో కంకరతో వెళ్తున్న టిప్పర్ ద్విచక్ర వాహనంపై వస్తున్న సత్యంరెడ్డిని ఢీ కొనడంతో సత్యంరెడ్డికి, ఆయన తల్లి ఎల్లవ్వకు తీవ్రగాయాలయ్యాయి. మోటార్‌ బైక్‌ను ఢీకొన్న వెంటనే టిప్పర్ సికింద్రాబాద్ నుండి వేములవాడకు వస్తున్న వేములవాడ డిపో బస్సును ఢీ కొట్టింది. దాంతో టిప్పర్ డ్రైవర్ కార్తీక్, ఆర్టీసీ బస్సు  డ్రైవర్ కొమురయ్యతో పాటు మరో ఇద్దరు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో గాయాల పాలైన వారిని ఆసుపత్రికి సిరిసిల్ల జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సత్యంరెడ్డి మృతి చెందాడు. సత్యంరెడ్డికి భార్య అనిత, 3 సంవత్సరాల కుమారుడు ఉన్నారు. మృతి చెందిన సత్యంరెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ప్రధాన వైద్యశాల ముందు ఆందోళన చేపట్టారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్త కుండా పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం తెల్లవారు జామున తంగళ్లపల్లి మండలం నేరెళ్లలో ఇసుక లారీ అదుపు తప్పి రెండు స్థంభాలను ఢీకొట్టి ఇంట్లోకి దూసుకువెళ్లిన ఘటనలో ఇరువురికి గాయాలయ్యాయి. ఒకేరోజు రెండు ప్రమాదాలు జరగడంతో సిరిసిల్ల ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

Related Stories: