మంచిర్యాల : జన్నారం పోలీసు స్టేషన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జన్నారం ఎస్ఐ తహిసినొద్దీన్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసు జీప్ బోల్తా పడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. లక్షెటిపేటలో లోక్ అదాలత్‌కు హాజరై తిరిగొస్తున్న సమయంలో జన్నారం జింకల పార్క్ సమీపంలో జీప్ ముందు టైరు పేలిపోయింది. దీంతో జీప్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన తహిసినొద్దీన్ను ఆస్పత్రికి తరలించారు.