రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి..!

నల్గొండ: స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాత పడిన విషాద సంఘటన నార్కట్‌పల్లి సమీపంలో చోటు చేసుకుంది. మిర్యాలగూడలో ఉన్న తమ మిత్రుడు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ చెందిన ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. అయితే, నార్కట్‌పల్లి శివారులో జాతీయ రహదారిపై బైపాస్‌ వద్ద గురువారం అర్ధరాత్రి బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం […]

నల్గొండ: స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాత పడిన విషాద సంఘటన నార్కట్‌పల్లి సమీపంలో చోటు చేసుకుంది. మిర్యాలగూడలో ఉన్న తమ మిత్రుడు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ చెందిన ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. అయితే, నార్కట్‌పల్లి శివారులో జాతీయ రహదారిపై బైపాస్‌ వద్ద గురువారం అర్ధరాత్రి బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments

Related Stories: