రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Two persons dead in the road accident
అమ్రాబాద్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌ మండలం శ్రీ శైలం అమ్రాబాద్ రహధారిపై చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సంగారెడ్డికి చెందిన ఎండి భాషా (28), వారితో పాటు మరో యువకుడు, వారి కుటుంబికులు 8మంది కలిసి శ్రీశైలం దర్శనానికి వెళ్తు తిరుగు ప్రయాణంలో వట్వర్లపల్లి సమీపంలో గుర్తు తెలియని వాహనం అదుపు తప్పి ఆటోను ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. 5గురి పరిస్తితి విషమంగా ఉండటంతో ఆంబులెన్స్ సహకారంతో అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి వారిని హైదారాబాద్ ప్రభుత్వాసుపత్రికి పంపించారు. స్థానిక ఈగల పెంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు మృతదేహాల్ని అమ్రాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.