రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

Two People died in Road Accident at Kadapa

కడప : ఖాజీపేట మండలం భూమాయపల్లె సమీపంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వేగంగా వెళుతున్న వ్యాన్ బోల్తాపడడంతో ఈ ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి తిరుమల వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అయితే మృతుల, గాయపడిన వారి వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Two People died in Road Accident at Kadapa

Comments

comments