రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

Two Persons Injured In Road Accident
బిజినెపల్లి : మండల పరిధిలోని మహదేవుని పేట ప్రధాన రహదారి బోయపూర్ గేటు సమీపంలో కాంక్రీట్ మిల్లర్ లారీని ఢీకొని ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం రాయిచుర్ జిల్లా మస్కా గ్రామం నుండి దాదాపు 8 బైక్ లపై శ్రీశైలం వెళ్తున్నారు. కాగా బోయపూర్ గేట్ సమీపంలో ప్రధాన రహదారి పై మిషన్ భగిరథ పనుల్లో భాగంగా రహదారిని ధ్వంసం చేసిన అధికారులు నిర్లక్ష్యంగా వదిలి వేయడంతో ద్విచక్ర వాహనాల పై వస్తున్న వారు గమనించక పోవడంతో దగ్గరగా వచ్చిన వెంటనే సడన్ బ్రేక్ వేయడంతో వెనకాల వస్తున్న మరో బైక్ బలంగా ఢీకొట్టి ముందుగా వస్తున్న కాంక్రీట్ లారీని ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న ఎమ్మురప్ప, రామన్న వ్యక్తులు లారీ కింద పడడంతో వారికి తీవ్రమైన గాయాలయ్యాయి. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గమనించిన స్థానికులు 108 వాహనంలో జిల్లా ఆసుపత్రికి తరలించారు. సంఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు ఎస్ ఐ ప్రదీప్ కుమార్ తెలిపారు.

Comments

comments