రోడ్డు ప్రమాదంలో అథ్లెట్ మృతి

నైరోబి : కెన్యాకు చెందిన ప్రముఖ అథ్లెట్ నికోలస్ బెట్ (28) రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. నైజీరియాలో జరిగిన ఆఫ్రికా హార్డల్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొని ఇంటికి వెళుతున్న సమయంలో నాంది కౌంటీ వద్ద మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఆయన మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఘటనాస్థలిలోనే బెట్ చనిపోయారు. బెట్ 2015లో జరిగిన 400 మీటర్ల హార్డల్స్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి ప్రపంచ చాంపియన్‌గా రికార్డు […]

నైరోబి : కెన్యాకు చెందిన ప్రముఖ అథ్లెట్ నికోలస్ బెట్ (28) రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. నైజీరియాలో జరిగిన ఆఫ్రికా హార్డల్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొని ఇంటికి వెళుతున్న సమయంలో నాంది కౌంటీ వద్ద మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఆయన మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఘటనాస్థలిలోనే బెట్ చనిపోయారు. బెట్ 2015లో జరిగిన 400 మీటర్ల హార్డల్స్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి ప్రపంచ చాంపియన్‌గా రికార్డు సృష్టించారు. రెండుసార్లు ఆఫ్రికా హార్డల్స్ చాంపియన్‌షిప్ సాధించారు. బెట్ మృతిపై పలువురు క్రీడాకారులు సంతాపం వ్యక్తం చేశారు.

Kenya’s Former World Champion Bett dies in Road Accident

Comments

comments