రోగనిరోధకశక్తి పెరగాలంటే..

వర్షాకాలంలో చిన్నపిల్లలు ఎక్కు వగా జలుబు, దగ్గు, వైరల్ జ్వరాలబారిన పడుతుంటారు. శరీరంలోని రోగనిరోధక శక్తి తగ్గిన క్రమంలోనే రకరకాల ఇన్‌ఫెక్షన్లు సోకే అవ కాశాలు ఎక్కువగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని వారికి అందించడం వల్ల సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు. పుట్టగొడుగులు: వానాకాలంలో సహజసిద్ధంగా వచ్చే పుట్టగొడుగులను ఎంచుకోవాలి. మష్‌రూమ్‌లోని ‘యాంటీవైరస్’ గుణాలు, శరీరాన్ని వైరల్ ఇన్‌ఫెక్షన్లు బారిన పడకుండా కాపాడతాయి. చిలకడదుంపలు: వీటిలో ఉండే పోషకాలు బీటా కెరోటిన్ శరీరంలోకి వెళ్లిన […]

వర్షాకాలంలో చిన్నపిల్లలు ఎక్కు వగా జలుబు, దగ్గు, వైరల్ జ్వరాలబారిన పడుతుంటారు. శరీరంలోని రోగనిరోధక శక్తి తగ్గిన క్రమంలోనే రకరకాల ఇన్‌ఫెక్షన్లు సోకే అవ కాశాలు ఎక్కువగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని వారికి అందించడం వల్ల సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు.

పుట్టగొడుగులు: వానాకాలంలో సహజసిద్ధంగా వచ్చే పుట్టగొడుగులను ఎంచుకోవాలి. మష్‌రూమ్‌లోని ‘యాంటీవైరస్’ గుణాలు, శరీరాన్ని వైరల్ ఇన్‌ఫెక్షన్లు బారిన పడకుండా కాపాడతాయి.
చిలకడదుంపలు: వీటిలో ఉండే పోషకాలు బీటా కెరోటిన్ శరీరంలోకి వెళ్లిన తర్వాత విటమిన్ ‘ఎ’ గా మారి శరీరంలో గల వైరస్‌తో పోరాడేందుకు ఉపయోగపడతాయి. ఈ దుంపలోని విటమిన్ సి, డి వల్ల కూడా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, జలుబు వంటివి వచ్చినప్పుడు లోపల మ్యూకస్ పొరలు దెబ్బతింటాయి. వీటిని తిరిగి అభివృద్ధి చేసేందుకు తోడ్పడతాయి.
క్యాప్సికం: ఎర్రటి రంగులో ఉండే క్యాప్సికంలో గల విటమిన్ ‘సి’ గల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, ఇతర వైరల్ ఇన్‌ఫెక్షన్ల్లు బారిన పడినప్పడు తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి. సన్నటి ముక్కలుగా చేసి సలాడ్ లాగా తీసుకుంటే దీంట్లో విటమిన్ ‘సి’ ఎక్కువగా లభిస్తుంది.
పెరుగు: జలుబు, దగ్గు చేసినప్పుడు పెరుగు తీసుకునేందుకు చాలా మంది భయపడుతుంటారు. కానీ దీనిలో లభించే లాక్టోవసిల్లీ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా కడుపు, పేగులలో గల పొరలను ఆరోగ్యకరంగా ఉంచడమే కాకుండా, శరీరంలోకి ప్రవేశించిన వైరస్‌లు సంఖ్య అధికం అవ్వకుండా కాపాడేంత శక్తి ఉంటుంది. తద్వారా రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధి త్వరగా నయం అయ్యే అవకాశం ఉంటుంది.
గుమ్మడి గింజలు: వీటిలో జింక్ అధికంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని పెంపొందించే గుణాలు బాగా అధికంగా ఉంటాయి. వీటిని పచ్చి వాసన పోయేదాకా సన్నటి మంట మీద వేగించి పెట్టుకుని ప్రతి రోజు 1_2 స్పూన్లు తినవచ్చు. వీటిని పొడిగా చేసుకుని, సలాడ్స్ లేదా దోసెలు, ఆమ్లెట్ పైన కూడా వేసుకుని తినవచ్చు. జామకాయ, బొప్పాయి, కమల, బత్తాయి, కివీ, స్ట్రాబెర్రీలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వీటిన్నింటిలో గల విటమిన్ ‘సి’ శరీరాన్ని రోగాల బారిన పడకుండా కాపాడతాయి.