రైస్ బ్లాక్…

భద్రాద్రి కొత్తగూడెం: బియ్యం ధరకు మళ్లీ రెక్కలు వచ్చేశాయి. ప్రభుత్వం ధాన్యానికి మద్దతు ధర పెంచుతూ ప్రకటన చేయడంతో ధాన్యం వ్యాపారుల్లో కక్కుర్తి అలుముకున్నట్టు తీవ్ర చర్చ సాగుతోంది. వారి కక్కుర్తి వల్ల ఇప్పుడు బియ్యానికి రెక్కలు వస్తున్నాయి. సాధారణంగా క్వింటా సాంబమసూరి ధర రూ.4500 ఉండగా, గత రెండు రోజులుగా అవే క్వింటా బియ్యాన్ని రూ. 4,800 వరకు అమ్మకం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది పంటకు చెందిన బియ్యాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేసే […]

భద్రాద్రి కొత్తగూడెం: బియ్యం ధరకు మళ్లీ రెక్కలు వచ్చేశాయి. ప్రభుత్వం ధాన్యానికి మద్దతు ధర పెంచుతూ ప్రకటన చేయడంతో ధాన్యం వ్యాపారుల్లో కక్కుర్తి అలుముకున్నట్టు తీవ్ర చర్చ సాగుతోంది. వారి కక్కుర్తి వల్ల ఇప్పుడు బియ్యానికి రెక్కలు వస్తున్నాయి. సాధారణంగా క్వింటా సాంబమసూరి ధర రూ.4500 ఉండగా, గత రెండు రోజులుగా అవే క్వింటా బియ్యాన్ని రూ. 4,800 వరకు అమ్మకం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది పంటకు చెందిన బియ్యాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేసే వ్యాపారాలు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో గల రైస్ మిల్లులకు చేర్చుకుని బియ్యాన్ని అండించి 25 కేజీల చొప్పున మూటలు తయారు చేసి విక్రయిస్తుంటారు. అయితే ఇప్పుడు పాత స్టాక్ మొత్తాన్ని గోదాముల్లో దాచేసే ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా రేషన్ బియ్యం కాకుండా నెలకు సుమారు 70 టన్నుల పైబడి బియ్యాన్ని వాడుతుంటారు. ఇప్పుడు ఈ బియ్యం మొత్తాన్ని అధిక ధరలకు అంటగట్టేందుకు వ్యాపారులు ఇప్పటికే సమాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.

గోదాముల్లోకి: జిల్లాలో ఉన్న అన్ని బియ్యం స్టాకులను ఇప్పటికే వ్యాపారులు వారివారి గోదాముల్లో తరలించినట్టు తెలుస్తోంది. కృత్రిమ కొరతను సృష్టించి, గత ఏడాది పెరిగే ధరకు అనుగుణంగా లాభాలు ఆర్జించేందుకు వ్యాపారాలు ఈ ఎత్తుగడ వేసినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బియ్యం ప్రస్తుతానికి అందుబాటులో లేవని, స్టాక్ వస్తే తప్ప అమ్మలేమని ఖరాకండిగా చెబుతున్నట్టు పలువురు వినియోగ దారులు అంటున్నారు. మరో ప్రక్క టిక్కీ బియ్యం ధర స్వల్పంగా పెరిగిందని కూటా వ్యాపారులు చెప్పకనే చెబుతున్నట్లు తెలుస్తోంది. బియ్యం నిత్యవసరం కావడంతో అదనంగా అయ్యే ధరను లెక్కపెట్టకుండా వినియోగదారులు బియ్యం కొనేందుకు మక్కువ చూపుతున్నారని పలువురు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు జిల్లాలో ఏర్పడుతున్న బియ్యం కృత్రిమ కొరతపై దృష్టి సారించి, స్టాక్ పాయింట్లపై దాడులు చేసి వినియోగదారులకు మేలు చేకూర్చాలని పలువురు కోరుతున్నారు.

Related Stories: