రైళ్లల్లో దొంగల బీభత్సం

301 Northern Railway Trains Timings Change

లక్నో: ఉత్తర ప్రదేశ్ లోని చిత్రా కూట్ వద్ద ఆదివారం రాత్రి 1.30 గంటలకు గంగా కావేరీ ఎక్స్ ప్రెస్ లో దొంగలు ప్రయాణికులను కత్తులతో బెదిరించారు.  ప్రయాణికుల నుంచి డబ్బు, నగదును ఎత్తుకెళ్లారు. బిహార్ రాజధాని పాట్నాకు వెళ్తున్నప్పుడు ఈ ఘటనా చోటుచేసుకుంది. మరో చెన్నై- పాట్నా ఎక్స్ ప్రెస్ రైలులో సోమవారం వేకువజామున  దోపిడీ దొండలు బీభత్సం సృష్టించారు. దొంగలు బోగీల్లోకి చొరబడి ప్రయాణికులపై దాడి చేసి నగలు, డబ్బులను  అపహరించారు.  దోపిడీ దొంగల దాడిలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ప్రయాణికులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు రైళ్లు రెండు గంటలు ఆలస్యంగా నడుస్తాయని రైల్వే అధికారులు వెల్లడించారు.

Comments

comments