రైళ్లలో జోరుగా అక్రమ బియ్యం సరఫరా

  • రెండు రోజుల్లోనే 190 బస్తాల పట్టివేత
  • నిత్యకృత్యమైన బియ్యం రవాణా
  • వ్యాపారం వెనుక పెద్దల హస్తం, అధికారుల అండదండలు

Adilabad_Ration_Riceమంచిర్యాల: నిరుపేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో తెలంగాణ సర్కారు ఒక్క రూపాయికి కిలో బియ్యం చొప్పున ఆహారభద్రతా కార్డులపై అందిస్తోంది. నిరుపేదల నోటి కాడి కూడును రాబందువుల్లా లాక్కెళ్ళుతున్నారు. తమ అక్రమ వ్యాపారం కోసం లాక్కున్న బియ్యాన్ని రైళ్ళలో తెలంగాణా టు మహారాష్ట్ర తరలిస్తున్నారు. బుధవారం రాత్రి నుండి గురువారం ఉదయం వరకు రైల్వే పోలీసులు చేపట్టిన సెర్చ్‌లో ఏకంగా 190 బస్తాలు పట్టుబడ్డాయి. ఈ సోదాలతో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ వ్యాపారం ఎంత పెద్ద మొత్తంలో సాగుతుందో ఇట్ట్టే అర్థం చేసుకోవచ్చు.
రైల్వేమార్గం రాజమార్గం

అక్రమ బియ్యం తరలించడానికి రైలు మార్గాన్నే రాజమార్గంగా ఎంచుకుంటున్నారు వ్యాపారస్తులు. మిగతా మార్గాల్లో తరలిస్తే వాహనాలతో పాటు వ్యక్తులను పట్టుకునే అవకాశం ఉండటంతో రైలుమార్గాన్ని ఎంచుకుంటున్నారు దళారులు. ఈ మార్గంలో తరలించడంతో రైలుస్టేషన్లలో నిమిషం పాటు ఆగే అవకాశం ఉండటంతో పోలీసుల తనిఖీలు చేపట్టడం కష్ట తరమైన విషయం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని దళారులకు రైలు మార్గం రాజమార్గంగా మారింది. నిరుపేదల వద్ద నుండి సైకిళ్ళపై కొనుగోలు చేయ డంతో పాటు, ఆహారభద్రతా కార్డులను కొంతడబ్బులు ఇచ్చి తాకట్టు పెట్టుకుం టున్నారు దళారులు. దీనికి తోడు డీలర్లు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ వారం పాటు పంపిణీ చేసి మిగతా వాటిని తమ పద్దతిలో అక్రమబాట పట్టిస్తున్నారు.
ఒక్కరోజే 190 బస్తాల పట్టివేత: బుధవారం రాత్రి నుండి గురువారం ఉదయం వరకు రైల్వే పోలీసులు తనిఖీలు విస్తృతంగా తనిఖీలు చేప ట్టారు. సికింద్రాబాద్ నుండి బల్లార్శా వెళ్ళే రైలులో 105 బస్తాలు, నాగ్‌పూర్ ప్యాసింజర్‌లో 65 బస్తాలు, కాజీపేట నుండి బల్లార్షా వెళ్ళే రామగిరిలో 20 బస్తాలు పట్టుకున్నారు. మొత్తంగా 190 బస్తాలు పట్టుబడ్డాయి. ఒక్క రూపాయికి ప్రభుత్వం నిరుపేదలకు అందించే బియ్యం మహారాష్ట్రలో రేటు ఎక్కువగా ఉండటంతో మహారాష్ట్ర బాట పట్టిస్తున్నారు. జమ్మికుంట నుండి వీరూర్‌కు ఈ అక్రమ రవాణా సాగుతున్నట్లు తెలుస్తోంది. సిబ్బంది కొరతవల్ల తనిఖీలు సరిగా చేపట్టలేకపోతున్నామనీ, కేవలం మంచిర్యాల స్టేషన్‌లో 20 మంది పోలీ సులు మాత్రమే ఉన్నారనీ సిబ్బంది పూర్తిస్థాయిలో సిబ్బందిని కేటాయిస్తే బియ్యంతో పాటు సూత్రధారులను పట్టుకుంటామని, రెవెన్యూ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సహకరిస్తే ఈ అక్కమ వ్యవహారంపై ఉక్కుపాదం మోపేందుకు తాము సిద్ధ్ధంగా ఉన్నామని మంచిర్యాల రైల్వే ఎస్‌ఐ మునీరుల్లా చెబుతున్నారు. బుధవారం నిర్వహించిన తనిఖీల్లో రైల్వే పోలీస్ సిబ్బంది జగన్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments