రైలు పట్టాలపై యువతి మృతదేహం లభ్యం

Unknown Girl Dead Body found on Track near Ghatkesar Railway Station

మేడ్చల్: జిల్లా ఘట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై శనివారం ఉదయం గుర్తుతెలియని యువతి(19) మృతదేహం లభ్యమైంది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, యువతిది ఆత్మహత్య లేక హత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.