రైలు కింద పడి వ్యక్తి మృతి

కమాన్‌పూర్: మండలంలోని పేంచికల్‌పేట శివారులోని రైల్వే ట్రాక్‌పై ఎన్టిపిసి నుండి ఓసిపి  1 మధ్య నడిచే రైలు రైలు కిందపడి రామగుండం కార్పోరేషన్ పరిధిలోని న్యూమారెడుపాకకు చెందిన సిరిగరిసమ్మయ్య (33) మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న కమాన్‌పూర్ ఎస్ఐ అనవేన మల్లేశం సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించడంతో పాటు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసుల కథనం మేరకు గోదావరిఖని అడ్డగుంటపల్లికి చెందిన సమ్మయ్య గత 3 సంవత్సరాల క్రితం […]

కమాన్‌పూర్: మండలంలోని పేంచికల్‌పేట శివారులోని రైల్వే ట్రాక్‌పై ఎన్టిపిసి నుండి ఓసిపి  1 మధ్య నడిచే రైలు రైలు కిందపడి రామగుండం కార్పోరేషన్ పరిధిలోని న్యూమారెడుపాకకు చెందిన సిరిగరిసమ్మయ్య (33) మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న కమాన్‌పూర్ ఎస్ఐ అనవేన మల్లేశం సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించడంతో పాటు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసుల కథనం మేరకు గోదావరిఖని అడ్డగుంటపల్లికి చెందిన సమ్మయ్య గత 3 సంవత్సరాల క్రితం న్యూమారెడుపాకకు వచ్చి నివాసం ఉంటున్నాడు. లారీ క్లీనర్‌గా పనిచేస్తు జీవనం కోనసాగిస్తున్నాడు. మద్యానికి బానిసగా మారి తరుచు ఇంట్లో కుటుంబ సభ్యులతో గోడవపడేవాడు. గతమూడు రోజుల కిత్రం సమ్మయ్య మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గోడవపడ్డాడు. దీంతో భార్య తిరుమల తన ఇద్దరు పిల్లలను తీసుకోని గోదావరిఖనిలోని రిక్షాకాలనీలో ఉంటున్న తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లింది. తన భార్య పిల్లలు వెళ్లారని మనస్థాపం చెందిన సమ్మయ్య శనివారం రాత్రి పేంచికల్‌పేట గ్రామశివారులోని రైల్వేట్రాక్‌పైకి వెళ్లి ఎస్టిపిసి ఓసిపి  1 మధ్య నడిచే రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని భౌతికకాయాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య తిరుమలతో పాటు ఇద్దరు కుమారులు సందీప్, రాజబాబు లు ఉన్నారు.

Related Stories: