రైలు కింద పడి విద్యార్థి మృతి

Dharmavaram express train Lying down student dead

గద్వాల: రైల్లో నుంచి ప్రమాదవశాత్తు క్రింద పడి విద్యార్థి మృతి చెందిన సంఘటన ఇటిక్యాల మండలం పెద్దదిన్నే రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ కథనం మేరకు… ఇటిక్యాల మండలం పెద్దదిన్నే గ్రామానికి చెందిన చిన్న వెంకటేష్(17) గద్వాలలో ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్ సిటి కాలేజిలో డిగ్రీ సీటు రావడంలో కాలేజ్‌లో చేరి తిరుగు ప్రయాణంలో ప్రమాదం చోటుచేసుకుంది. ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి దిగడానికి ప్రయత్నించిన సమయంలో ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందినట్టు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. మృత దేహనికి గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ అన్నారు.