రైలులో వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్ : మధురై – కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మధురై నుంచి కాచిగూడకు వస్తున్న రైలులోని ఓ బోగీ బాత్రూమ్‌లో వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడాన్ని గమనించిన ప్రయాణికులు రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. రైలు కాచిగూడ వచ్చిన తరువాత రైల్వే పోలీసులు బాత్రూమ్ తలుపులు తెరిచారు. పోస్టుమార్టం కోసం ఆ వ్యక్తి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రైలు బాత్రూమ్‌లో సదరు వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, అతని వద్ద టికెట్ […]

హైదరాబాద్ : మధురై – కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మధురై నుంచి కాచిగూడకు వస్తున్న రైలులోని ఓ బోగీ బాత్రూమ్‌లో వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడాన్ని గమనించిన ప్రయాణికులు రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. రైలు కాచిగూడ వచ్చిన తరువాత రైల్వే పోలీసులు బాత్రూమ్ తలుపులు తెరిచారు. పోస్టుమార్టం కోసం ఆ వ్యక్తి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రైలు బాత్రూమ్‌లో సదరు వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, అతని వద్ద టికెట్ లేకపోవడంతో ఎక్కడ రైలు ఎక్కాడో తెలియడం లేదని రైల్వే పోలీసులు తెలిపారు. దీంతో మృతుడి వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Man Committed Suicide in Train

Comments

comments

Related Stories: