రైలులో రూ.65లక్షలు పట్టివేత

Rs.65 lakh Seized in Train

హైదరాబాద్ : రైలులో రూ.65లక్షలు పట్టుబడింది. ఈ ఘటన నాంపల్లి రైల్వేస్టేషన్‌లో గురువారం ఉదయం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు ఓ రైలు బోగీలలో సోదాలు చేశారు. పట్టుబడిన నగదును కంటైనర్‌లో, చెప్పులు, ఎలక్ట్రానిక్ వస్తువుల డబ్బాల్లో ప్యాక్ చేసి తరలిస్తుండగా రైల్వే పోలీసులు పట్టుకున్నారు. ఈ నగదును ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామని వారు వెల్లడించారు. పట్టుబడిన నగదులో రెండు వందలు, రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు.

Rs.65 lakh Seized in Train

Comments

comments