రైలుతో కికీ.. ముగ్గురు యువకులకు శిక్ష…(వీడియో)

Kiki on Moving Train Court Orders 3 men to Clean Station: Mumbai

ముంబయి: కికీ ఛాలెంజ్  విపరీత పరిణామాలకు దారితీస్తోంది. మహారాష్ట్రలోని విరార్ ప్రాంతంలో ముగ్గురు యువకులు కికి ఛాలెంజ్ పేరిట వింత పోకడలకు పోయారు. దాని ఫలితంగా ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు. నిషాంత్ షా(20), ధ్రువ్ షా(23), శ్యాం శర్మ(24) అనే ముగ్గురు యువకులు కికీ ఛాలెంజ్ పేరిట కదులుతున్న రైల్లో నుంచి కిందకి దిగి డ్యాన్స్ చేశారు. అంతటితో ఆగకుండా ఫ్లాట్‌ఫాంపై రకరకాల విన్యాసాలు చేశారు. దీన్నంతా వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అది  పోలీసుల కంట పడింది. రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు ఆ ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారించిన రైల్వే కోర్టు ముగ్గురు యువకులకు ఈ వారంలో మూడు రోజుల పాటు విసాయ్ రైల్వే స్టేషన్‌ను శుభ్రం చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

Comments

comments