రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

438 మంది రైతులకు భూ నష్టపరిహారం కింద రూ. 26.36 కోట్లు పంపిణీ రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడి మన తెలంగాణ/నిర్మల్ : అన్నదాతను అని విధాలుగా ఆదుకొని ఆర్థికంగా బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్షం అని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ,దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.  శుక్రవారం దిలావర్‌పూర్ మండలంలోని న్యూ లోలం, బన్సపెల్లి గ్రామాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫ్యాకేజి 27 వలన భూములు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెక్కులు పంపిణి, బన్సపెల్లి […]

438 మంది రైతులకు భూ నష్టపరిహారం కింద రూ. 26.36 కోట్లు పంపిణీ
రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడి

మన తెలంగాణ/నిర్మల్ : అన్నదాతను అని విధాలుగా ఆదుకొని ఆర్థికంగా బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్షం అని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ,దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.  శుక్రవారం దిలావర్‌పూర్ మండలంలోని న్యూ లోలం, బన్సపెల్లి గ్రామాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫ్యాకేజి 27 వలన భూములు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెక్కులు పంపిణి, బన్సపెల్లి గ్రామంలో రూ. 16లక్షల వ్యయం తో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతు శేయస్సు కై రాష్ట్ర ప్రభు త్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. రూ. 80వేల కోట్ల వ్యయంతో  నిర్మిస్తున్న  కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో సాగునీరందించడం వలన రైతులు పంటలు పండించి ఆర్థికంగా బలోపేతం కావచ్చన్నారు. దేశంలో ఎక్కడ లేన విధంగా మన తెలంగాణ లో రైతులకు 24గంటల ఉచిత విద్యుత్,నాణ్యమైన ఎరువులులతో పాటె నిర్మల్ నియోజకవర్గంలో 25 విద్యుత్ సబ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆగస్టు 15 నుండి రైతులకు రూ. 5లక్షల ప్రమాద జీవిత అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫ్యాకెజి 27లో భూములు కోల్పయిన దిలావర్‌పూర్ మండలంలోని న్యూ లోలం గ్రామానికి చెందిన 133 మంది రైతులకు రూ. 9 కోట్ల 18 లక్షలు, బన్సపెల్లి గ్రామంలో భూములు కోల్పొయిన 32 మంది కి 1 కోటి 60లక్షల 97వేల 500 రూ,ల విలువ గల చెక్కులను అందించారు. అంతక ముందు న్యూ లోలం గ్రామంలోని పశు వైద్య శాలలో ఏర్పాటు చేసిన ఉచిత గాలికుంటు వ్యాది నిరోదక టీకా కార్యక్రమంలో పాల్గొని పశువులకు ఇంజక్షన్ ఇచ్చి, సబ్సిడి పై గొర్రెలను పంపిణి చేశారు. అనంతరం నర్సాపూర్(జి) మండలంలోని బావిని గరాయంలో 36 రైతులకు 2 కోట్ల 79 లక్షల 22వేలు 500లు,గొల్ల మాడ గ్రామంలో 237 మంది రైతులకు 12 కోట్ల 78 లక్షల విలువ గల చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రమేష్‌రాథోడ్, జిల్లా రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ నల్ల వెంకట్‌రామ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్,ఎఫ్‌ఎస్‌సిఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, ఎఎంసి చైర్మన్ ధర్మాజిగారి రాజేందర్, ఎంపీపీ పాల్దె లక్ష్మీ , టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, పశు సంవర్థక శాఖ అధికారి గజ్జారం, ఎన్‌ఆర్‌ఎస్పీ ఈఈ రామరావు, తహసీల్థార్ నర్సయ్య, సర్పంచ్ సునతి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: