రైతులకు అవగాహన సదస్సులేవి?

వర్షాలు కరువడంతో పంటల సాగులో రైతులు బిజీ అవగాహన లేమితో రైతుల అయోమయం రైతులకు సలహాలు, సూచనలు లేనట్టేనా? మనతెలంగాణ/అచ్చంపేట: ప్రతి ఏడాది కరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు పంటల సాగుపై అధికారులు, శాస్త్రవేత్తలు గ్రామాలలో రైతు సదస్సులు నిర్వహించి రైతులకు పంట ల సాగుపై అవగాహన శిభిరాలు నిర్వహించే వారు. కాం గ్రెస్ ప్రభుత్వంలో రైతు చైతన్య యాత్రల పేరుతో సదస్సు లు నిర్వహించగా, తెలంగాణ ప్రభుత్వంలో ‘మన తెలంగాణ […]

వర్షాలు కరువడంతో పంటల సాగులో రైతులు బిజీ
అవగాహన లేమితో రైతుల అయోమయం
రైతులకు సలహాలు, సూచనలు లేనట్టేనా?

మనతెలంగాణ/అచ్చంపేట: ప్రతి ఏడాది కరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు పంటల సాగుపై అధికారులు, శాస్త్రవేత్తలు గ్రామాలలో రైతు సదస్సులు నిర్వహించి రైతులకు పంట ల సాగుపై అవగాహన శిభిరాలు నిర్వహించే వారు. కాం గ్రెస్ ప్రభుత్వంలో రైతు చైతన్య యాత్రల పేరుతో సదస్సు లు నిర్వహించగా, తెలంగాణ ప్రభుత్వంలో ‘మన తెలంగాణ మన వ్యవసాయం’ కార్యక్రమం పేరుతో ప్రతి ఏడాది అవగాహన సదస్సులు నిర్వహించి రైతులను చైతన్య పరిచే వారు. కానీ ఈ ఏడాది ఎక్కడ సదస్సులు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించిన దాఖలాలు లేవు. ఖరీప్ ప్రారంభమై దాదాపు నెలన్నర కావస్తుండ డం, వార్షాలు కురుస్తుండడంతో రైతులు విత్తనాలు వేయ డం తదితర వ్యవసాయ పనులలో బిజీ అయ్యారు. పంట ల సాగుపై ఎలాంటి అవగాహన లేక పోవడంతో రైతులు అయోమయానికి గురై తమకు తోచిన విదంగా పంటలు సాగు చేసుకుంటున్నారు. పంటలు వేసే సమయంలో ఏ విత్తనాలు వాడాలి, ఎరువులు ఎంత మోతాదులో ఏమందులు వాడాలనే అంశాలపై వ్యసాయ అధికారులు గతం లో సూచనలిచ్చే వారు. ఈఏడాది ఎలాంటి అవగాహన సదస్సులు నిర్వహించక పోవడంతో రైతులు తమ ఇష్టానుసారం ఎరువులు విత్తనాలు వాడుతున్నారు. దీంతో పా టు వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు ప్రభుత్వం నుండి అందించే ఎరువులు, విత్తనాలు, విత్తనశుద్ధి, సబ్సిడీ పరికరాలపై రైతులకు ఎలాంటి సమాచారం అందడం లేదు.

అధికారులకు అందని ఆదేశాలు
వ్యవసాయ అనుబంద శాఖలపై రైతులకు అవగాహన కల్పించి సాగుకు సమయాత్తం చేయడానికి అధికార యంత్రాంగం ప్రతి ఏడాది మే మొదటి వారం నుంచి రైతు అవగాహన సదస్సులు నిర్వహించే వారు. రైతులకు సలహాలు సూచనలు అందించి రైతులకు వ్యవసాయంలో అండగా ఉండడంతో పాటు, తక్కువ పెట్టుబడులతో ఎక్కువ దిగుబడులు సాదించే విదంగా చైతన్య పరిచే వా రు. ఈఏడాది వ్యవసాయ శాఖ అధికారులకు ప్రభుత్వం నుండి ఎలాంటి ఉత్తర్వులు రాక పోవడంతో అధికారులు రైతు సదస్సులు నిర్వహించ లేదు. దీంతో రైతులు ప్రయివేటు ఫర్టిలైజర్ వ్యాపారులు చెప్పిన ఎరువులు, విత్తనాలు వాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది రైతుబం దు, రైతుబీమా పథకాలలో వ్యవసాయ శాఖ సిబ్బంది నిమగ్నం కావడంతో మనతెలంగాణ మన వ్యవసాయం కార్యక్రమం నిర్వహించ లేక పోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది వ్యవసాయ శాఖ ద్వారా రైతుల కు ఎలాంటి లాభం జరగలేదని రైతులు చర్చిచంచుకుంటున్నారు. అచ్చంపేట డివిజన్ పరిధిలోని అచ్చంపేట, లింగాల, బల్మూర్, ఉప్పునుంతల, అమ్రాబాద్, పదర మండలాలో ఆరు తడి పంటలైన ప్రత్తి, మొక్కజొన్న, జొ న్న, చెనగ పంటలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైన రైతులకు సలహాలు సూచనలందించి వ్యవసాయ రంగాన్ని లాభాల బాటలోకి తీసుకువచ్చే వి ధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Comments

comments

Related Stories: