రైతు సంక్షేమమే టిఆర్ఎస్ లక్షం
రైతుబీమా పథకాన్ని ప్రారంభించిన సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ఆధునిక వ్యవసాయానికి అహర్నిషలు శ్రమిస్తున్న సిఎం కెసిఆర్
రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్‌రెడ్డి
మన తెలంగాణ/వనపర్తి రూరల్ : రైతుబంధు, రైతుభీమాతో సిఎం కెసిఆర్ రైతులకు ఆత్మబంధువు, రైతుబాంధవుడయ్యారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి మండల పరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలో శనివారం రైతుబీమా పథకాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. రైతుబంధు పథకంలో భాగంగా రైతుబీమా పథకాన్ని దాదాపు 360 మందికి దరఖాస్తు పత్రాలను నమోదు చేశారు. ఈ సం దర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రమేష్‌గౌడ్, ఎంపిపి శంకర్‌నాయక్, మార్కెట్‌యార్డు చైర్మన్ ఎత్తం రవికుమార్,గొర్రెల సహకార సంఘం జిల్లా అధ్యక్షులు కురుమూర్తి యాదవ్‌లతో కలిసి రైతుబీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ రైతుబీమా పథకం రైతులకు భరోసా కల్పించిందన్నారు. సిఎం కెసిఆర్ రైతుబంధు, రైతుబీమాను ప్రవేశపెట్టి రైతులకు ఆత్మబంధువు అయ్యార న్నారు. రైతుబీమా చేసిన రైతులకు ప్రమాద వశాత్తు మృతి చెందినచో నామినికి రూ.5లక్షలు అందజేయబడుతుందని ఈ పథకం ఆగష్టు 15న ప్రారంభం అవుతుందని అందుకే రైతుల పేర్లను నమోదు చేయ డం జరుగు తుందని రైతులు అధికారులకు సహకరించాలని రైతుబంధు మాదిరిగానే రైతుబీమా పథకాన్ని విజయవంతం చేయాలని నిరంజన్‌రెడ్డి రైతులను కోరా రు. అప్పాయపల్లి,మెట్పల్లి, శ్రీనివాసపురం, గ్రామాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు 4 రోజుల్లో ఎంజె 4 కాల్వ పనులను త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
ఆధునిక వ్యవసాయానికి అహర్నిషలు శ్రమిస్తున్న సిఎం కెసిఆర్ : రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్‌రెడ్డి
ఈసందర్భంగా రైతునుద్దేశించి రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమానికి టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రైతులకు రైతుభీమా, రైతుబంధు కల్పించి రైతులకు భరోసా ఇచ్చారని అన్నారు. ఆధునిక వ్యవసాయాభివృద్ధికి సిఎం కెసిఆర్ అహర్నిషలు శ్రమిస్తున్నారన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్‌రెడ్డి, ఎంపిపి శంకర్‌నాయక్, మార్కెట్ యార్డు చైర్మన్ ఎత్తం రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.