రైతుబంధు వల్ల బాగుపడింది గొల్లకుర్మలే

The very happy with the farmers' housing scheme

పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్

మనతెలంగాణ/సిరిసిల్ల: తెలంగాణలో అధికంగా వ్యవసాయ భూములున్న గొల్లకురుమలే రైతుబంధు పథకం వల్ల బాగుపడ్డారని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. సోమవారం సి రిసిల్లలోఐటి,పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో కలిసి రెండోవిడత గొర్రెల ప పిణీ కార్యక్రమాన్ని తలసాని ప్రారంభించారు. గొల్లకుర్మల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ గొ ర్రెల పంపిణీ పథకాన్ని ముందుకు తెచ్చారన్నారు. 75శాతం సబ్సిడీతో గొర్రెలను అందించే పథకాన్ని రూపొందించారన్నారు.
ప్రపంచంలోనే అత్యంత గుండె ధైర్యం ఉన్న సిఎం కెసిఆర్ అని అన్నారు. గత సంవత్సరం 60లక్షల గొ ర్రెలను పంపిణీ చేశామని అవి 25వేల పెట్టాయన్నా రు.పశువుల కోసం 100సంచార పశు వైద్యశాలల ను ఏర్పాటు చేశామన్నారు. జూలై 10నుండి ప్రతి ఫో న్‌కాల్‌కు సంచార పశు వైద్యశాల రెస్పాండ్ అవుతుందన్నారు. మరో100 సంచార పశువైద్యశాలలు కావాలని కోరామన్నారు. 10వేల కోట్ల రూపాయల వ్య యం అయినా సరే ప్రతి ఒక్కరికి గొర్రెలను అందించే కృషి చేస్తున్నామన్నారు.ఇప్పటి వరకు 60లక్షల గొ ర్రెలు పంపిణీ చేయగా 65 వేల గొర్రెలు చనిపోయాయని 35వేల గొర్రెలను రీ ప్లేస్ చేశామని వివరించా రు. మిగిలిన వాటిని కూడా మరో వారంలో అందిస్తామన్నారు. గొర్రెలు చనిపోతే 48గంటల్లో ఇన్సూరెన్స్ అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు.గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడడానికి కులవృత్తులు బాగుపడాలన్నారు. తెలంగాణలో అభివృద్ధి పనులు,సంక్షే మపథకాలు గొప్పగా సాగుతున్నాయన్నారు. కాంగ్రె స్,బిజెపిలు అవాకులు,చవాకులు పేలుతున్నారని బి జెపి బస్సు యాత్ర పేరిట రాష్ట్ర వ్యాప్తంగా అసత్యాలు చేస్తున్నారన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హై దరాబాద్‌లోని ముషీరాబాద్‌లో శాసనసభ్యునిగా గె లువలేడన్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో 150 సీట్లకు 99 సీట్లు ఘనత తెరాసది అన్నారు. కాంగ్రెస్‌కు రా ష్ట్రాన్ని పాలించే సత్తా లేదన్నారు. 24 గంటల కరెంట్ తెరాస ఘనత అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటి, పు రపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, ఎంపి బోయిన్‌పల్లి వినోద్‌కుమార్,టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, జడ్‌పి చైర్మన్ తుల ఉమ, స ందీప్‌కుమార్ సుల్తానియా,కన్నెబోయిన రాజయ్య, కలెక్టర్ కృష్ణభాస్కర్,దోర్నాల లకా్ష్మరెడ్డి,గడ్డం నర్స య్య,సామల పావని, తదితరులు పాల్గొన్నారు.