రైతన్న ఆర్థికాభివృద్ధే కెసిఆర్ లక్షం

Indrakaran-reddy-image

మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి 

మన తెలంగాణ/నిర్మల్ : ఆరుగాలం కష్టించి పంటలు పండించే రైతన్నను ఆర్థికంగా అభివృద్ధి పరచేందుకే కెసిఆర్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యర్డ్‌లో నిర్మల్, సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలీల పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టని సంక్షేమ పథకాలు మన తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్నాయన్నారు. రైతులు తలెత్తుకొని జీవించేలా భూ రికార్డ్‌ల శుద్ధీకరణ కార్యక్రమం చేపట్టి రైతులందరికీ పట్టా పాస్ పుస్తకాలు అందించిన ఘనత కెసిఆర్‌దే అన్నారు. అలాగే ఎకరానికి రూ. 4వేలతో పాటు రెండు పంటలకు గాను రూ. 8 వేలు అందింస్తున్నామన్నారు. అలాగే రైతులకు 24గంటల ఉచిత కరెంట్, కళ్యాణ లక్ష్మి, షాదీమూభారక్,మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు ముఖ్యమంత్రి కేసిఆర్ వలనే సాధ్యం అయ్యాయన్నారు. అలాగే అగస్టు 15 నుండి రైతులకు రూ. 5లక్షలు ప్రమాద భీమా రాష్ట్రంలో ప్రారంభమవుతుందన్నారు. నిర్మల్ జిల్లాలో ఈ సంవత్సరం 6.20లక్షల క్వింటళ్ల రూ. 88.50 కోట్ల విలువైన మక్కలు కొనుగోలు చేసి రూ.80 కోట్ల వరకు రైతులకు చెల్లించడం జరిగిందన్నారు. 1.02 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం రూ. 160 కోట్ల,పత్తి , నువ్వులు, కందులు పప్పుదినుసులు తదితర ధాన్యం రూ. 100 కోట్ల విలువ గల రైతుల నుండి కొనుగోలు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 175 కోట్ల పండ పెట్టుబడి సాయంగా రైతులకు చెల్లించడం జరిగిందని, రెండవ విడత సెప్టెంబర్ మాసంలో రూ. 175/5 కోట్ల చెల్లించనున్నామన్నారు. జిల్లాలో 400 ట్రాక్టర్లను సబ్సిడి పై రైతులకు అందించడం జరిగిందన్నారు. అలాగే 100 నుండి 150 వరకు రైతులకు ఇవ్వానున్నమన్నారు. హర్వేస్టర్లు,నాటు వేసే యంత్రాలు 50 శాతం సబ్సిడి పై అందించనున్నామన్నారు. అంతే కాకుండా 20 నుండి 25 సంవత్సరాల లోపు గల యువకులక నాటు వేసే యంత్రాలు నడిపేలా శిక్షణ ఇవ్వనున్నామన్నారు. ఇప్పటికే జిల్లాలో 10వేల మెట్రిక్ టన్నుల గోదాంలు, సారంగాపూర్‌లో 5వేల మెట్రిక్ గోదామ్‌లు, జామ్,దిలావర్‌పూర్, లక్ష్మణచాంద,మామడ,సోన్, నర్సాపూర్‌ల మండలాల్లో నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలో రైతుల కోసం నూతనంగా 25 విద్యుత్ సబ్ స్టేషన్‌లను ఏర్పాటు చేశామన్నారు. మరో 15 రోజుల్లో సోన్ మండలంలోని వెల్మల్ బోప్పారం గ్రామంలో మంత్రి కేటిఆర్,జగదీష్‌రెడ్డిలతో 400 కెవి సబ్‌స్టేషన్‌ను ప్రారంభిచనున్నామన్నారు. అంతకు ముందు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్ , సారంగాపూర్ మార్కెట్ కమిటి చైర్మన్‌ల తో ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ ప్రమాణా స్వీకార కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్‌చక్రవర్తి, ఎఫ్‌ఎస్‌సిఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ నల్ల వెంకట్‌రాంరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, నిర్మల్ మార్కెట్ కమిటి చైర్మన్ ధర్మాజిగారి రాజేందర్, రాజ్ మహ్మద్,అల్లోల గౌతంరెడ్డి, అల్లోల మురళిధర్‌రెడ్డి,పిఎస్‌సి చైర్మన్ రామేశ్వర్‌రెడ్డి, నజీరొద్దిన్, మార్కెట్ కమిటి అధికారి శ్రీనివాస్, కమిటి సభ్యులు,ఆయా మండలాల సర్పంచులు, ఎంపిటిసిలు, జెడ్పిటిసిలు,మండల అధ్యక్షులు,పట్టణ కౌన్సిలర్లు ,రైతులు,కౌన్సిటర్లు పాల్గొన్నారు.