రేపు ఢిల్లీ వెళ్లనున్న సిఎం కెసిఆర్

CM Kcr to meet Modi in Delhi tomorrow

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఢిల్లీ పర్యటన ఖరారైంది. సిఎం కెసిఆర్ రేపు సాయంత్రం ఉన్నతాధికారులతో కలిసి ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి సచివాలయ నిర్మాణానికి రక్షణ శాఖ స్థలాల కేటాయింపు గురించి , కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్న అంశాలపై ప్రధాని మోఢీతో పాటు ఇతర కేంద్ర మంత్రులను సిఎం కెసిఆర్ కలవనున్నారు. ఢిల్లీలోనే రెండు మూడు రోజుల ఉండి ప్రధాని, ఇతర మంత్రులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించుకొవాలని సిఎం నిర్ణయించారు. సిఎం కెసిఆర్‌తో పాటు సిఎస్ ఎస్‌కే జోషి, ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు ఢిల్లీ వెళ్లనున్నారు

Comments

comments