రేపటి నుంచి ట్రక్కర్ల నిరవధిక సమ్మె

Truckers Indefinite Strike from Friday

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా శుక్రవారం నుంచి ట్రక్కర్ల నిరవధిక సమ్మె ప్రారంభం కానుంది. ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌ఫోర్ట్ కాంగ్రెస్ పిలుపుతో ఈ సమ్మెను నిర్వహించనున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా 95లక్షలకు పైగా లారీలు, ట్రక్కులు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. కేంద్ర, రాష్ట్రాల పన్నులను తొలగించి డిజిల్‌ను జిఎస్‌టి పరిధిలకి తేవాలని లారీల యజమానులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంను తగ్గించాలని, ఏజెంట్లకు ఎక్కువ మొత్తంలో కమిషన్లు ఇవ్వడాన్ని నిర్మూలించాలని లారీ యజమానులు కోరుతున్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.

Truckers Indefinite Strike  from Friday

Comments

comments