‘రెరా’కార్యాలయాన్ని ప్రారంభించిన కెటిఆర్…

Ktr formally inaugurated the Ts Rera office

హైదరాబాద్ : నగరంలో కొత్తగా నిర్మించిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) కార్యాలయాన్ని ఐటి శాఖ మంత్రి కెటిఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ఎంపిలు మల్లారెడ్డి, బండారు దత్తాత్రేయతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ లోని ఎసి గార్డ్స్‌లోని డిటిసిపి ప్రాంగణంలో ఈ కార్యాలయాన్ని నిర్మించారు. రెరా కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ మంత్రి కెటిఆర్ మొక్కలు నాటారు.